అంబేద్కర్ మహోన్నత వ్యక్తి: ప్రధాని మోదీ

Thu,April 14, 2016 03:52 PM

ambedkar is great personality pm modhi

మధ్యప్రదేశ్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈమేరకు ఇవాళ మధ్యప్రదేశ్‌లోని అంబేద్కర్ స్వగ్రామం మౌలో నిర్వహించిన వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అంబేద్కర్ స్మారకాన్ని సందర్శించారు. గ్రామ్ ఉదయ్ సే, భారత్ ఉదయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ.. అంబేద్కర్ స్వగ్రామంలో ఆయన జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అంబేద్కర్ మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. అంబేద్కర్ స్వేచ్చా, సమానత్వం, సాంఘీక న్యాయం కోసం పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్థికాభివృద్ధి పట్టణాలకే పరిమితం కావొద్దన్నారు.

1850
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles