భారతీయ భాషలు మాట్లాడనున్న అమెజాన్

Tue,September 11, 2018 04:09 PM

amazon to speak indian languages

అత్యధికశాతం భారతీయులను చేరుకునేందుకు అమెజాన్ కసరత్తు చేస్తున్నది. భారత్‌లో హిందీ మాట్లాడేవారు సుమారు 50 కోట్ల మందివరకు ఉంటారు. వారిలో అత్యధికులు హిందీలోనే మాట్లాడుతారు. ఇంగ్లీషు కొద్దిమందికే వస్తుంది. ఆ మాటకు వస్తే భారతదేశం మొత్తం జనాభా 130 కోట్ల మందిలో కేవలం పదిశాతం మందికి మాత్రమే ఇంగ్లీషు వచ్చు. మరి అమెజాన్ లాంటి ఆన్‌లైన్ వ్యాపార సంస్థలు ఇంగ్లీషు భాషలోనే కార్యకలాపాలు నిర్వహిస్తాయి. సగటు భారతీయునికి, అందులోనూ భాషాపరంగా అధికసంఖ్యాకులైన హిందీవారికి దానివల్ల ఏం ఉపయోగం? ఏదో నెట్టుకువస్తుంటారు. అందుకే ఇప్పుడు అమెజాన్ జై హిందీ మంత్రం పఠిస్తున్నది.

మంగళవారం హిందీలో ఆన్‌లైన్ కార్యకలాపాలను ప్రవేశపెట్టింది. సుమారు 2 లక్షల 30 వేల కోట్ల రూపాయల ఈ-కామర్స్ మార్కెట్‌లో ప్రస్తుతం అమెజాన్ నంబర్ టూగా ఉంది. తనకు 15 కోట్ల మంది రిజిస్టర్డ్ కస్టమర్లు ఉన్నట్టు అమెజాన్ చెప్పుకుంటున్నది. అమెరికాలో అమెజాన్ సైటులో ఇంగ్లీషుతో పాటుగా స్పానిష్ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు అదే తరహాలో హిందీని ప్రవేశపెట్టి మార్కెట్ పెంచుకోవాలని అమెజాన్ చూస్తున్నది. తమకు తదుపరి 10 కోట్ల మంది స్థానిక భాషా కస్టమర్లే ఉంటారని అమెజాన్ ఇండియా సీనియర్ అధికారి కిశోర్ తోట తెలిపారు. హిందీలో సైటు, యాప్స్ సక్సెస్ అయిన తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ భాషల్లోకి విస్తరించనున్నట్టు వివరించారు. అయితే ఈ దిశగా ప్రయాణంలో అనువాద సమస్యలు చాలానే ఎదుర్కొన్నది. ఇప్పుడిప్పుడే అన్ని కుదుటపడుతున్నాయి. భారతీయ భాషల్లో ఇంగ్లీషు మాటలు విరివిగా వాడడమే దీనికి కారణం.

955
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles