రాఫెల్ డీల్‌పై నిరాధార ఆరోపణలు వద్దు : రాజ్‌నాథ్

Sat,September 22, 2018 03:17 PM

All the allegations are baseless on Rafale deal says Rajnath Singh

న్యూఢిల్లీ : రాఫెల్ డీల్‌పై నిరాధార ఆరోపణలు చేయొద్దని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రతిపక్షాలకు సూచించారు. రాఫెల్ ఒప్పందం విషయంలో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ శాఖ ఒక ప్రకటనను విడుదల చేస్తుందన్నారు. అప్పుడు ఆ ప్రకటనను ప్రతిపక్షాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు అని తెలిపారు. ఏమీ తెలియకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. రూ. 58 వేల కోట్ల రాఫెల్ ఒప్పందంలో ఫైటర్‌జెట్ విమానాల తయారీ సంస్థ దస్సాల్ట్ ఏవియేషన్‌కు భాగస్వామిగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థను చేర్చుకోవాలని ప్రధాని మోదీయే తమకు సూచించారని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.

925
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles