కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశం

Sun,June 16, 2019 12:07 PM

All party meeting continues in parliament building


న్యూఢిల్లీ: పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిల పక్ష సమావేశం కొనసాగుతోంది. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి టీఆర్ఎస్ నుంచి కేశవరావు, నామ నాగేశ్వరరావు, వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, టీడీపీ నుంచి గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు హాజరయినట్లు సమాచారం. సమావేశంలో పార్లమెంట్ సమావేశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి జూలై 26 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయిన తర్వాత జరుగుతున్న తొలి అఖిలపక్ష సమావేశం ఇది.

1524
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles