దేశ‌వ్యాప్త స‌మ్మెకు డాక్ట‌ర్ల పిలుపు

Fri,June 14, 2019 04:28 PM

All India Doctors strike on Monday, Centre blames Mamata Banerjeeహైద‌రాబాద్‌: డాక్ట‌ర్లు సోమ‌వారం దేశ‌వ్యాప్త స‌మ్మె చేప‌ట్ట‌నున్నారు. బెంగాల్ డాక్ట‌ర్ల‌కు సంఘీభావంగా ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నున్న‌ది. కోల్‌క‌తాలో ఓ గ‌వ‌ర్న‌మెంట్ హాస్ప‌ట‌ల్‌లో జూనియ‌ర్ డాక్ట‌ర్‌పై కొంద‌రు దాడి చేశారు. ఆ దాడిని ఖండిస్తూ అక్క‌డ కొన్ని రోజులుగా జూడోలు స‌మ్మె చేస్తున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఆ రాష్ట్ర సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ డాక్ట‌ర్ల‌కు వార్నింగ్ ఇచ్చారు. 4 గంట‌ల్లోనే విధుల్లో చేరాలంటూ ఆల్టిమేటమ్ జారీ చేశారు. దీంతో ఆగ్ర‌హించిన డాక్ట‌ర్లు మ‌రింత బెట్టుకు దిగారు. ఢిల్లీ, ముంబైతో స‌హా ఇత‌ర ప‌ట్ట‌ణాల్లో జూనియ‌ర్ డాక్ట‌ర్లు మెడిక‌ల్ స‌ర్వీసుల‌ను నిలిపేశారు. బెంగాల్ తీరు ప‌ట్ల కేంద్రం తీవ్ర అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసింది. జూడోల స‌మస్య‌ను ప‌రువు స‌మ‌స్య‌గా చూడ‌రాదు అని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ .. బెంగాల్ సీఎంకు ప‌రోక్ష హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. డాక్ట‌ర్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించేందుకు క‌ట్టుబడి ఉన్న‌ట్లు కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ చెప్పారు. మ‌రోవైపు బెంగాల్ మెడికోలు భారీ సంఖ్య‌లో రాజీనామా కూడా చేశారు.

553
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles