సోమవారం దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మె

Fri,June 14, 2019 04:00 PM

All India Doctors Strike Monday

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు సోమవారం నాడు విధులను బహిష్కరించనున్నారు. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమ్మెకు పిలుపునిచ్చింది. కోల్‌కతాలో జూనియర్ వైద్యులపై దాడులకు నిరసనగా తమ సంఘీభావాన్ని ప్రకటిస్తూ సమ్మెకు పిలుపునిచ్చింది. ఢిల్లీ, ముంబయితో ఇతర నగరాల్లో వైద్యులు నేడు విధులను బహిష్కరించారు. వీరి నిరసనతో వైద్య సేవలకు అంతరాయం కలుగుతోంది. ఈ విషయంలో సీఎం మమతా బెనర్జీ పంతానికి పోవొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల రక్షణకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో నాలుగు రోజుల క్రితం ఓ రోగి మృతి చెందడంతో.. ఆ ఆస్పత్రి జూనియర్‌ డాక్టర్లపై రోగి బంధువులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. దీంతో పశ్చిమ బెంగాల్‌లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న జూనియర్‌ డాక్టర్లు ఆందోళనకు దిగారు. తమకు రక్షణ కల్పించాలని, తమ డిమాండ్లను నెరవేర్చాలని బెంగాల్‌ జూడాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరి నిరసనకు దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు మద్దతు తెలుపుతున్నారు.

1569
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles