సంఝౌతా పేలుడు కేసు.. నలుగురు నిర్దోషులే

Wed,March 20, 2019 06:54 PM

All four accused persons in the 2007 Samjhauta Blast Case were acquitted

హార్యానా: సంఝౌతా రైలు బాంబు పేలుడు-2007 కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నలుగురు నిందితులను పంచకుల ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు బుధవారం నిర్దోషులుగా ప్రకటించింది. సంఝౌతా పేలుడు కేసులో స్వామి అసీయానంద్‌, లోకేశ్‌ శర్మ, కమల్‌ చౌహాన్‌, రాజిందర్‌ చౌదరిలను ఎన్‌ఐఏ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అనుమానం మీద చర్య తీసుకోలేమని, కుట్రకు సంబంధించి దర్యాప్తు సంస్థ తగిన ఆధారాలతో నిరూపించని కారణంగా వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు కోర్టు తీర్పు వెల్లడి సందర్భంగా పేర్కొంది. 2007, ఫిబ్రవరి 18న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన బాంబు పేలుడులో 68 మంది ప్రయాణీకులు మరణించిన విషయం తెలిసిందే.

586
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles