ప్రభుత్వ ఆఫీసులో మద్యం సేవిస్తూ విధులు..వీడియో

Sun,April 21, 2019 04:36 PM

Aligarh employees seen pouring liquor into glasses inside office


యూపీ: అది ప్రభుత్వ కార్యాలయం..నలుగురు ఉద్యోగులు తమ విధులు నిర్వర్తిస్తున్నారు..ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా..? బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగులై ఉండి పట్టపగలే ఆఫీసులో మందు కొడుతూ పనిచేస్తున్నారు. అలీగఢ్ లో రోడ్లు, రవాణా శాఖకు చెందిన నలుగురు ఉద్యోగులు ఆఫీసులో మందు సేవిస్తూ డ్యూటీ చేస్తున్నారు. ఇద్దరు ఉద్యోగులు క్యాలిక్యులేటర్ ను ముందుపెట్టుకుని లెక్కలను సరిచూసుకుంటుండగా..పక్కనే మరో ఉద్యోగి టేబుల్ డ్రాలోని గ్లాసుల్లోకి మద్యం పోస్తుండగా..ఇంకో ఉద్యోగి పక్కనే కూర్చొని ఉన్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో అలీగఢ్ రవాణా శాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసి..దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.3142
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles