స్టాలిన్‌ను అధినేతగా అంగీకరిస్తా! : అళగిరి

Thu,August 30, 2018 03:05 PM

Alagiri Climbdown Will Accept Stalin As Leader If DMK Takes Me Back

చెన్నై : తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. తనను పార్టీలో చేర్చుకోకపోతే స్టాలిన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తదన్న ఆయన సోదరుడు ఎంకే అళగిరి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తనను పార్టీలో చేర్చుకుంటే.. స్టాలిన్ డీఎంకే అధినేతగా అంగీకరిస్తానని చెప్పారు. పార్టీలో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నానని అళగిరి స్పష్టం చేశారు. స్టాలిన్‌ను లీడర్‌గా అంగీకరించడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన అళగిరిని 2014లో డీఎంకే నుంచి కరుణానిధి బహిష్కరించిన విషయం విదితమే.

2701
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles