అక్ష‌ర‌ధామ్ దాడి.. యాసిన్ భ‌ట్ అరెస్టు

Fri,July 26, 2019 06:50 PM

Akshardham temple attack accused Yasin Butt brought to Ahmedabad

హైద‌రాబాద్‌: గుజ‌రాత్‌లోని అక్ష‌ర‌ధామ్ ఆల‌యంపై 2002లో జ‌రిగిన దాడి కేసులో నిందితుడు యాసిన్ భ‌ట్‌ను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. యాంటీ టెర్ర‌రిజం స్క్వాడ్‌(ఏటీఎస్‌) పోలీసులు భ‌ట్‌ను క‌శ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ నిమిత్తం ఇవాళ అత‌న్ని అహ్మ‌దాబాద్‌కు తీసుకువ‌చ్చారు. 2002, సెప్టెంబ‌ర్ 24వ తేదీన ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు అక్ష‌ర‌ధామ్ ఆల‌యంలోకి ప్ర‌వేశించి కాల్పులు జ‌రిపారు. ఆ కాల్పుల్లో 30 మంది మ‌ర‌ణించారు. 80 మంది గాయ‌ప‌డ్డారు. ఎన్ఎస్‌జీ క‌మాండోలు వ‌చ్చి.. ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చారు. ఈ కేసులో ఆరుగురు అనుమానితుల్ని గుజ‌రాత్ పోలీసులు అరెస్టు చేశారు.

648
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles