నేనంటే ప్రభుత్వానికి భయం..

Tue,February 12, 2019 12:24 PM

Akhilesh Yadav stopped at Lucknow airport

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి తానంటే భయమని.. అందుకే నిర్బంధించారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ పేర్కొన్నారు. అలహాబాద్‌ యూనివర్సిటీలో స్టూడెంట్‌ యూనియన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్తున్న అఖిలేష్‌ యాదవ్‌ను లక్నో ఎయిర్‌పోర్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అఖిలేష్‌ యాదవ్‌ ట్వీట్‌ చేశారు. తాను స్టూడెంట్‌ యూనియన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్తే సీఎం యోగి ఆదిత్యనాథ్‌ భయపడుతున్నారని, అందుకే తనను నిర్బంధించారని ట్వీట్‌ చేశారాయన. ఎలాంటి రాతపూర్వక ఉత్తర్వులు లేకుండా, విమానం ఎక్కకుండా నిర్బంధించారని, తనను లక్నో ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారని అఖిలేష్‌ పేర్కొన్నారు. స్టూడెంట్‌ యూనియన్‌ ప్రమాణస్వీకారానికి తాను వెళ్తుంటే బీజేపీ ప్రభుత్వం ఎలా భయపడుతుందో.. ఈ సంఘటనను చూస్తే అర్థమవుతుందన్నారు. ఈ అన్యాయాన్ని దేశ యువత సహించదు అని బీజేపీకి తెలిసినప్పటికీ హద్దుమీరి ప్రవర్తిస్తోందని అఖిలేష్‌ ధ్వజమెత్తారు.

1367
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles