లక్నో విమానాశ్రయంలో అఖిలేశ్‌ను అడ్డుకున్న పోలీసులు

Tue,February 12, 2019 05:08 PM

లక్నో విమానాశ్రయంలో సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌ను పోలీసులు అడ్డుకోవడంపై యూపీలో రాజకీయ దుమారం చెలరేగుతున్నది. తనను విమానం ఎక్కకుండా ఆపడంపై అఖిలేశ్ మండిపడ్డారు. ఇది అప్రజాస్వామికమని, అత్యంత తీవ్రంగా ఖండించాల్సిన విషయమని అన్నారు. యోగి సర్కారు భయంతో ఇలా చేస్తున్నదని ఆరోపించారు. యువత దీనిని సహించరని ట్విట్టర్‌లో హెచ్చరించారు. చౌదరి చరణ్‌సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తనను పోలీసులు నిర్బంధించారని ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించి అఖిలేశ్ టీం విడుదల చేసిన వీడియోలో ఓ మఫ్టీ పోలీసు ఆయనను అడ్డుకోవడం కనిపించింది. హాథ్ మత్ లగాయియే అంటూ అఖిలేశ్ గట్టిగా అరవడం వినిపించింది. తర్వాత అఖిలేశ్ సెక్యూరిటీ సిబ్బంది జోక్యంతో అవతలి వ్యక్తి వెనుకకు తగ్గాడు. అలహాబాద్ యూనివలర్సిటీ విదయార్థుల కార్యక్రమంలో పాల్గొనేందుకుగానూ ప్రయాగరాజ్ వెళ్లేందుకు మంగళవారం అఖిలేశ్ లక్నో ఏర్‌పోర్టుకు వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. ఇటీవలే ఎస్పీతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ నేత మాయావతి కూడా దీనిపై స్పందించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తమ పొత్తుపై అప్పుడే భయాందోళనకు గురవుతున్నదని మాయావతి చెప్పారు. బీజేపీ ప్రభుత్వ సంపూర్ణ నియంతృత్వానికి ఇది నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

2527
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles