ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అజయ్ మాకెన్ రాజీనామా

Fri,January 4, 2019 10:01 AM

Ajay Maken Resigns As Delhi Congress Chief

ఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అజయ్ మాకెన్(54) రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆయన రాజీనామాను ఆమోదించినట్లుగా సమాచారం. అజయ్ మాకెన్ గడిచిన నాలుగేళ్లుగా ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడి పనిచేశారు. ఆరోగ్య కారణాలరీత్యా రాజీనామా చేసినట్లుగా చెబుతున్నప్పటికీ కేంద్ర రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించేందుకు అదేవిధంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే నిమిత్తం రాజీనామా చేసినట్లుగా సమాచారం. ఇంతకాలం తనకు సహకరించిన పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి, కార్యకర్తలకు, మీడియాకు ఆయన ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

1198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles