ఫ్లయిట్‌లో సీటు కింద బంగారు కడ్డీలు..

Fri,April 28, 2017 04:45 PM

AIU seized 11 Gold bars in plane seat


గోవా : ఎయిర్‌ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు గోవా ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని గుర్తించారు. ఎయిర్ ఇండియా విమానంలోని సీటు కింద ఉన్న 11 బంగారు కడ్డీల (1280 గ్రాములు)ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.34 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. విమానంలోకి బంగారు కడ్డీలు ఎవరు తెచ్చారనే విషయమై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

999
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles