ఎయిర్ ఇండియా సర్వర్ డౌన్.. విమానాలు ఆలస్యం

Sat,June 23, 2018 04:56 PM

Air india flights delayed at Delhi Airport after server failure

న్యూఢిల్లీ: కొన్ని గంటల నుంచి ఎయిర్ ఇండియా సర్వర్ సడెన్‌గా డౌన్ అయిపోయింది. దీంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలు దేరాల్సిన విమానాలు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. ల్యాండ్ అవ్వాల్సిన విమానాలు కూడా విమానాశ్రయంలో దిగకుండా పైనే చక్కర్లు కొడుతున్నాయి. ఇక.. విమానాలు ఆలస్యం కావడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. అంతే కాదు.. ప్రయాణికులు ఖాళీగా కూర్చోలేక తమ బాధనంతా సోషల్ మీడియాలో వెల్లగక్కుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఎన్ని విమానాలు ఆలస్యం అయ్యాయనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు."ఇప్పుడే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాను. ఎయిర్ ఇండియా సర్వర్స్ డౌన్ అయ్యాయి. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు ఆలస్యం కానున్నాయి. ప్రయాణికులంతా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయారు. కనీసం నడవడానికి కూడా ఎయిర్‌పోర్ట్‌లో ప్లేస్ లేకుండా అయిపోయింది. అంతా గందరగోళం.." అంటూ బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అఖిలేశ్ మిశ్రా ట్వీట్ చేశాడు.

"గంట నుంచి విమానం ఎప్పుడు ల్యాండ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరూ దాని గురించి సమాచారం ఇవ్వలేదు. ఎయిర్ ఇండియా ప్రత్యక్ష నరకం చూపిస్తున్నది.." అంటూ ఓ వ్యక్తి ఎయిర్ ఇండియా విమానం నుంచి ట్వీట్ చేశాడు.1167
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles