గోడను ఢీకొట్టిన విమానం.. 136 మంది సురక్షితం

Fri,October 12, 2018 12:13 PM

Air India Flight Hit Wall During Take Off at Trichy airpport

చెన్నై : తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో తిరుచ్చి ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం దుబాయ్‌కు బయల్దేరింది. టేకాఫ్ సమయంలో ఎయిర్‌పోర్టు కంపౌండ్ వాల్‌ను విమానం ఢీకొట్టింది. దీంతో విమానం ఆంటీనా దెబ్బతింది. విమానం రెండు టైర్లు గోడను ఢీకొట్టినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బందితో పాటు 130 మంది ప్రయాణికులున్నారు. వీరంతా సురక్షితంగా ఉన్నారు. అయితే గోడను ఢీకొట్టిన కాసేపటికి తిరుచ్చి ఏటీసీతో ఈ ఎయిరిండియా విమానానికి సిగ్నల్స్ ఆగిపోయాయి. మళ్లీ కాసేపటికి సిగ్నల్స్ అందడంతో.. సురక్షితంగా ముంబై ఎయిర్‌పోర్టులో ఉదయం 5.35 గంటలకు విమానాన్ని ల్యాండ్ చేశారు. అక్కడ్నుంచి మరో విమానంలో ప్రయాణికులను దుబాయ్‌కు తరలించారు. ఈ ఘటనపై ఏవియేషన్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇద్దరు పైలట్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

1626
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles