ఒంట‌రిగా మిగ్ న‌డిపిన ఎయిర్‌ఫోర్స్ చీఫ్

Fri,January 13, 2017 01:37 PM

Air Force Chief BS Dhanoa Flies MIG 21 Fighter

న్యూఢిల్లీ: ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ బీఎస్ ధ‌నోవా ఒంట‌రిగా మిగ్ 21 యుద్ధ విమానాన్ని న‌డిపారు. ఐఏఎఫ్ ద‌గ్గ‌ర ఉన్న అత్యంత పురాత‌న ఫైట‌ర్ ఇది. రాజ‌స్థాన్‌లోని ఉత్త‌ర్‌లై ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో ఆయ‌న ఈ విమానాన్ని న‌డిపారు. ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా తొలిసారి ఓ ఫార్వ‌ర్డ్ ఆప‌రేష‌న‌ల్ బేస్ మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు ధ‌నోవా. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌శ్చిమ సెక్టార్ సంసిద్ధ‌త‌, అక్క‌డి సిబ్బంది ప‌నితీరును ప‌రిశీలించారు. త‌ర‌చూ కూలుతూ ఎగిరే శ‌వ‌పేటిక‌లుగా పేరున్న మిగ్ యుద్ధ విమానంలో ధ‌నోవా అర‌గంట పాటు చ‌క్క‌ర్లు కొట్ట‌డం గ‌మ‌నార్హం. ధ‌నోవా కంటే ముందు ఎయిర్‌చీఫ్ మార్ష‌ల్స్ హోదాలో ఏవై టిప్నిస్‌, దిల్‌బాగ్ సింగ్ కూడా ఈ మిగ్ విమానాల‌ను న‌డిపారు.

1280
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles