న్యూఢిల్లీ-విశాఖ మార్గంలో ఎయిర్ ఏషియా విమానాలు

Sat,October 31, 2015 07:53 AM

Air Asia flights on the route New Delhi-Visakhapatnam

హైదరాబాద్ : చవక విమానయాన ఆఫర్లతో తరచూ ఆకట్టుకునే ఎయిర్ ఏషియా, న్యూఢిల్లీ-విశాఖపట్నం, న్యూఢిల్లీ-గౌహతి మధ్య కొత్త మార్గాలను ప్రారంభించింది. ఈ రెండు మార్గాల్లోనూ ఆఫర్లను ప్రకటించింది. న్యూఢిల్లీ-విశాఖ మార్గంలో టికెట్ ధర రూ.3,490గా పేర్కొంది. ఈ ఆఫర్‌లో నవంబర్ 1వ తేదీలోగా టికెట్లు కోసం బుక్ చేసుకోవాలి. నవంబర్ 20 నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ 29 వరకు విమానాల్లో ప్రయాణం చేయవచ్చని తెలిపింది. ఇవే కాకుండా కొచ్చి-బెంగళూరు, బెంగళూరు-గోవా మార్గాల్లో రూ.1,590కే టికెట్లు అంటూ మరో ఆఫర్‌ను ఎయిర్ ఏషియా ప్రకటించింది. బెంగళూరు నుంచి పుణేకు రూ.1990 ధర నిర్ణయించింది. దీపావళి సందర్భంగా కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నం, గోవా, హాంకాంగ్ నగరాలకు మరో ఆఫర్ ప్రకటించింది. ఫిబ్రవరి 29 వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. నవంబర్ 1 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

1639
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles