నేడు ఛత్తీస్‌గఢ్ సీఎం ఖరారు?

Sun,December 16, 2018 07:58 AM

AICC select chattisgarh chief minister today

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ సీఎం ఎంపికపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం మూడో దఫా చర్చలు నిర్వహించారు. అనంతరం సీఎం పదవి ఆశావహులైన సింగ్ దేవ్, తామ్రధ్వజ సాహు, భూపేశ్ భాఘెల్, చరణ్‌దాస్ మహంత్‌లతో కలిసి తాను దిగిన ఫొటోను ట్వీట్ చేశారు. మీరెంత తెలివైన వారైనా.. వ్యూహచతురులైనా.. ఒంటరిగా ఆడితే విజయం దక్కదు.. జట్టుగా పోరాడితేనే విజయం సాధ్యం అంటూ అమెరికా ఇంటర్నెట్ దిగ్గజం రైడ్ హాఫ్‌మన్ చేసిన వ్యాఖ్యను కూడా ట్వీట్‌కు జత చేశారు. రాహుల్ నివాసంలో జరిగిన చర్చల్లో సోనియాగాంధీ, ప్రియాంక, ఖర్గే తదితరులు పాల్గొన్నట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఆదివారం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుందని, అంతకుముందే సీఎం పేరు ఖరారవుతుందని తెలుస్తున్నది.

1166
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles