ముందు నిరాహార దీక్ష.. వెనుక బీరు, బిర్యానీ!

Wed,April 4, 2018 01:35 PM

AIADMK protesters seen drinking Liquor and eating biryani during hunger strike

చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే కార్యకర్తల డ్రామా కెమెరాకు చిక్కింది. కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే శ్రేణులు ఒకరోజు నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. అయితే వెల్లూరు, కోయంబత్తూర్, సేలంలాంటి జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు ముందు వేదికపై నిరాహార దీక్షకు కూర్చుంటూ.. వెనుక మాత్రం మంచిగా మందు, బిర్యానీ లాగించడం కెమెరాలకు చిక్కింది. ఈ నిరాహార దీక్షల్లో మొత్తం మంత్రివర్గం పాల్గొన్నది. కేంద్రంపై ఒత్తిడి తీసుకు రాలేకపోతున్నారని ఇప్పటికే అధికార పార్టీపై తీవ్ర ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఇప్పుడీ వీడియోలు బయటకు రావడం మరిన్ని చిక్కుల్లోకి నెట్టింది. నిరాహార దీక్షల వేదికలకు దగ్గరగానే ఈ మందు, బిర్యానీ అడ్డాలు ఏర్పాటు చేసుకున్నారు.

6102
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles