భార్య, కూతురిని చంపి భర్త ఆత్మహత్య

Thu,September 13, 2018 09:43 AM

Ahmedabad family found dead suicide note points to black magic

అహ్మదాబాద్ : భార్య, కూతురిని చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన అహ్మదాబాద్‌లోని కృష్ణా నగర్ ఏరియాలో చోటు చేసుకుంది. కునాల్ త్రివేది(50), కునాల్ కవిత(45), కుతూరు కునాల్ శ్రీన్(16)తో పాటు త్రివేది తల్లి ఒకే నివాసంలో ఉంటున్నారు. అయితే త్రివేది గత కొంతకాలం నుంచి తాగుడుకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో ఆయన తల్లి తాగొద్దని వారించేది. తనకు చేతబడి చేయడంతోనే మద్యానికి బానిస అయ్యానని తల్లితో త్రివేది చెప్పేవాడు. ఈ విషయాన్ని తల్లి పెడచెవిన పెట్టింది. నిత్యం మద్యం సేవించి ఇంటికి వస్తున్న త్రివేదిపై కుటుంబ సభ్యులు కోపం చేసేవారు.

తనకు చేతబడి చేశారని.. అందుకే మద్యం సేవిస్తున్నానని త్రివేది చెప్పినప్పటికీ వినిపించుకోకపోవడంతో.. ఆయన ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిన్న భార్య, కూతురికి విషమిచ్చి.. తాను ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. తల్లి అపస్మారక స్థితిలో ఉండిపోయింది. 24 గంటలు గడిచినా కూడా ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. త్రివేది తల్లిని ఆస్పత్రికి తరలించారు. మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే త్రివేది డెడ్‌బాడీ వద్ద సూసైడ్ నోట్ లభ్యమైంది.

సూసైడ్ నోట్‌లోని సారాంశం.. అమ్మ.. నన్ను మీరు అర్థం చేసుకోలేకపోయారు. చేతబడి గురించి మీకు చెప్పాను. అది నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుందని చెబితే.. తాగుడుకు బానిస అయినందుకే అలా అవుతుందని మీరు చెప్పారు. తనకు చేతబడి చేశారని చెప్పిన కూడా మీరు నమ్మట్లేదు. ఇక ఈ ఘటనకు బాధ్యత వహించాల్సింది జిగ్నేష్ భాయ్. ఈ సింహం గుడ్‌బై చెబుతుంది. అందరూ చూసిన వారే తప్ప ఏ ఒక్కరూ కూడా ఏమి చేయలేకపోయారు అని రాసి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

7226
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles