అనాథలకు ‘పోలీసు పాఠశాల’

Wed,August 21, 2019 03:21 PM

Ahmedabad City Traffic Police imparts free education to children

అహ్మదాబాద్‌ : ఈ భూమ్మీద ఎంతో మంది చిన్నారులు అనాథలుగా ఉన్నారు. కొందరు అనాథలు కానప్పటికీ నిరాశ్రయులుగా ఉన్నారు. అటు అనాథలు, ఇటు నిరాశ్రయులు రోడ్ల ఫుట్‌పాత్‌లనే తమ ఆవాసాలుగా మలుచుకుంటున్నారు. అక్కడే భిక్షాటన చేస్తున్నారు. ఇలాంటి వారి కోసం అహ్మదాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. ఏడాదిన్నర క్రితం.. అహ్మదాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు.. ఫుట్‌పాత్‌లపై ఉండే చిన్నారుల కోసం ‘పోలీసు పాఠశాల’ను ఏర్పాటు చేశారు. మొదట్లో ఒకే పాఠశాలను ప్రారంభించారు. ప్రస్తుతం మూడు పాఠశాలలను నిర్వహిస్తున్నారు ట్రాఫిక్‌ పోలీసులు.

పక్వాన్‌ ఏరియా, దనిల్మిందా, కంకారియా ట్రాఫిక్‌ సెంటర్ల పరిధిలో ఈ పాఠశాలలను నెలకొల్పారు. ఇప్పుడు ఈ స్కూళ్లల్లో 200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఉచితంగా విద్యను అందిస్తూ.. కొన్ని సందర్భాల్లో పోలీసులే పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. పిల్లలను పాఠశాలకు తీసుకువచ్చేందుకు, మళ్లీ వారి ప్రాంతాల్లో దింపేందుకు సైకిల్‌ రిక్షాను పోలీసులు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వేళ ఉచితంగా భోజనం అందిస్తున్నారు. అనాథలు, నిరాశ్రయులైన పిల్లలకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ట్రాఫిక్‌ డీసీపీ అకింత్‌ పటేల్‌ పేర్కొన్నారు.578
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles