పియూష్ గోయల్‌కు తాత్కాలికంగా ఆర్థిక శాఖ బాధ్యతలు

Wed,January 23, 2019 10:18 PM

Ahead Of Interim Budget Piyush Goyal Fills In For Arun Jaitley

న్యూఢిల్లీ: పియూష్ గోయల్‌కు తాత్కాలికంగా ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. ఫిబ్రవరి 1 న మధ్యంతర బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యంతో బాధపడుతుండటంతో పియూష్ గోయల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలోనూ జైట్లీ స్థానంలో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల బాధ్యతలను పియూష్ గోయల్ నిర్వర్తించారు. అరుణ్ జైట్లీ గత కొంతకాలంగా సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. నిన్న న్యూయార్క్‌లో ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. దీంతో రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని జైట్లీకి వైద్యులు సూచించారు. ఫిబ్రవరి 1 న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండగా పియూష్ గోయల్‌కు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.

1344
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles