వ్యవసాయ రుణాల రద్దు దేశ ప్రగతికి మంచిది కాదట

Tue,December 12, 2017 07:08 AM

agricultural loans Former Governors of Reserve Bank of India RBI

న్యూఢిల్లీ : వ్యవసాయ రుణాల రద్దు దేశ ఆర్థిక ప్రగతికి, బ్యాంకింగ్ వ్యవస్థ పురోగతికి ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్లు. రైతులను ఆదుకోవాలంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచిస్తున్నారు. వ్యవసాయ రుణాల రద్దు రాజకీయ నిర్ణయమని, దీర్ఘకాలంలో అది ఆచరణీయం, ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. దీన్ని సమర్థించలేమని పేర్కొంటున్నారు. ఇక్కడ జరిగిన ఇన్‌క్లూజివ్ ఫైనాన్స్ ఇండియా సమ్మిట్ 2017లో పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ రుణాల రద్దు అనేది రుణాల చెల్లింపుల ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. చెల్లించే సామర్థ్యం ఉన్నవారినీ అడ్డుకుంటుంది అన్నారు. అంతకుముందు బిమల్ జలాన్, దువ్వూరి సుబ్బారావు, రెడ్డీలతో జరిగిన ప్యానెల్ చర్చలో పాల్గొన్న సీ రంగరాజన్ సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయ రుణాలను ఏమాత్రం ప్రోత్సహించరాదన్నారు.

1634
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles