40 ఏండ్ల తర్వాత ఆ ఫ్యామిలీని ఒక్కటి చేసిన యూట్యూబ్.. వీడియో

Fri,April 20, 2018 06:44 PM

After 40 years Youtube reunited Manipur man with his family

మానవ జీవితం ఎప్పుడు ఎలా ఎందుకు మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. మణిపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి కూడా సేమ్ ఇలాగే జరిగింది. తన జీవితం ఎటువైపు వెళ్లిందో.. మళ్లీ ఎటు మళ్లిందో ఆయనకే తెలియలేదు. ఎందుకంటే.. కొంద్రమ్ గంబీర్ సింగ్(66) అనే వ్యక్తి ఆయనకు 26 ఏండ్ల వయసు ఉన్నప్పుడు తన స్వస్థలమైన ఇంఫాల్‌ను వదిలి వెళ్లిపోయాడు. అంటే 1978లో మాట ఇది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అప్పట్లో ఆయన కోసం బాగానే వెతికారట. కాని ప్రయోజనం శూన్యం. దీంతో ఆయన మీద ఆశలు వదిలేసుకున్నారు.

కట్ చేస్తే.. మళ్లీ 40 ఏండ్ల తర్వాత అంటే 2018లో ఆయన వాళ్లకు కనిపించాడు. దీంతో షాక్ తిన్న కుటుంబ సభ్యులు మనోడిని వెతుక్కుంటూ వెళ్లారు. చివరకు సింగ్‌ను కలుసుకొని అతడిని మళ్లీ ఇంఫాల్‌కు తీసుకెళ్లారు. దీంతో కథ సుఖాంతం అయింది. కాని.. ఆ కుటుంబానికి ఆ వ్యక్తిని వెతికి పట్టించింది ఎవరో కాదు. యూట్యూబ్. అవును.. యూట్యూబే ఆ కుటుంబానికి ఆ వ్యక్తిని కనిపెట్టేలా చేసింది. అది కూడా 40 ఏండ్ల తర్వాత. అసలు విషయం ఏంటంటే...

ఇల్లు విడిచి వెళ్లిన తర్వాత సింగ్ మేస్త్రీ పనులు చేస్తూ అలా అలా కాలం వెల్లదీశాడట. చివరకు అక్కడా ఇక్కడా తిరిగి తిన్నగా ముంబైలో సెటిల్ అయ్యాడట. అక్కడ పాత హిందీ పాటలు పాడుతూ.. బిక్షం ఎత్తుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. అయితే.. మనోడు హిందీ పాటలు పాడుతుండగా ఓ ఔత్సాహికుడు ఆ పాటను తన కెమెరాలో బంధించి యూట్యూబ్‌లో షేర్ చేశాడట. దీంతో ఆ వీడియోను సింగ్ కుటుంబ సభ్యులు చూసి.. వెంటనే ముంబై చేరుకొని మనోడిని కనిపెట్టి ఇంపాల్‌కు తీసుకెళ్లారు.

ఇక.. 40 ఏండ్ల తర్వాత తిరిగి తమ ఊరికి సింగ్ వస్తుండటంతో ఊరు ఊరంతా కదిలింది. ఆయన ఊళ్లో అడుగు పెట్టగానే ఊరు ప్రజలంతా సింగ్‌కు దండలు వేసి ఊరేగింపుతో తన ఇంటికి తీసుకెళ్లారు. ఇదీ సింగ్ కథ. ఈ సింగ్‌ను ఊళ్లో ఊరేగిస్తుండగా తీసిన వీడియోలు, ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి.

4476
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles