కాంగ్రెస్ వాళ్లంతా పప్పూ అని పెట్టుకోవ‌చ్చు !

Tue,March 19, 2019 01:23 PM

Add Pappu to your names, says Haryana Minister Anil Vij to Cong workers

హైద‌రాబాద్: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తాను ఈ దేశానికి చౌకీదారుడిని చెప్పుకుంటున్న విష‌యం తెలిసిందే. చౌకీదార్ అంటే కాపాలాదారుడు అని అర్థం. మై బీ చౌకీదార్ అనే ప్ర‌చారాన్ని మోదీ ఇటీవ‌ల మొద‌లుపెట్టారు. అయితే త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఉండే పేరు ముందు కూడా చౌకీదార్ అని జోడించారు. ఆ త‌ర్వాత మోదీ క్యాబినెట్‌లో ఉన్న మంత్రులు కూడా త‌మ త‌మ ట్విట్ట‌ర్ అకౌంట్ల‌లో పేరు ముందు చౌకీదార్ అని జోడించారు. చౌకీదార్ అని పెట్టుకోవ‌డాన్ని కాంగ్రెస్ పార్టీ త‌ప్పుప‌ట్టింది. చౌకీదార్ ప‌దంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. చౌకీదార్ చోర్ హై అన్నారు. సంప‌న్నుల‌కే మోదీ చౌకీదారుడ‌ని ప్రియాంక కూడా విమ‌ర్శించింది. ఈ నేప‌థ్యంలో హ‌ర్యానాకు చెందిన బీజేపీ మంత్రి అనిల్ విజ్ ఓ సెటైర్ వేశారు. కాంగ్రెస్ పార్టీ నేత‌లు త‌మ ట్విట్ట‌ర్ అకౌంట్ల పేరు ముందు పప్పూ అని జోడించుకోవాల‌ని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని.. విప‌క్ష నేతలు పప్పూ అని వెట‌కారంగా సంబోధిస్తున్నారు. అయితే అకౌంట్ల పేరు ముందు పప్పూ అని పెట్టుకుంటే త‌మ‌కు ఎటువంటి అభ్యంత‌రం ఉండ‌ద‌ని బీజేపీ మంత్రి అనిల్ విమ‌ర్శ‌లు చేశారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లంతా త‌మ అకౌంట్ పేరు ముందు ప‌ప్పూ పెట్టుకోవాల‌ని మంత్రి అనిల్ అన్నారు.

1967
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles