లాల్ బాగ్ చా రాజా ను ద‌ర్శించుకున్న అమితాబ్, అభిషేక్

Sun,August 27, 2017 11:25 PM

Actors Amitabh Bachchan and Abhishek Bachchan offer prayers at Lalbaugcha Raja

ముంబై: శ్రీ లాల్ బాగ్ చా రాజా మ‌హా గ‌ణ‌ప‌తిని ఇవాళ బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ ద‌ర్శించుకున్నారు. ఆయ‌న‌తో పాటు అభిషేక్ బ‌చ్చ‌న్ కూడా వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా లాల్ బాగ్ చా రాజా కు ప్ర‌త్యేక పూజ‌లను అమితాబ్ నిర్వ‌హించారు. హైద‌రాబాద్ లో ఖైర‌తాబాద్ గ‌ణేశ్ ఎంత ఫేమ‌సో.. ముంబై లో లాల్ బాగ్ చా రాజా అంత ఫేమ‌స్. లాల్ బాగ్ చా రాజా ద‌ర్శ‌నం చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. దూర ద‌ర్శ‌న‌మే క‌నీసం ఒక రోజు ప‌డుతుంది. ఇక‌.. ద‌గ్గ‌ర ద‌ర్శ‌న‌మైతే క‌నీసం రెండు నుంచి మూడు రోజులు ప‌డుతుంది. లాల్ బాగ్ చా రాజా ఎంతో మ‌హిమ గ‌ల గ‌ణ‌ప‌తిగా మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు న‌మ్ముతారు. అందుకే దూర ప్రాంతాల నుంచి ప్ర‌త్యేకంగా ఆయ‌న‌ను ద‌ర్శించుకోవ‌డానికి భ‌క్తులు త‌ర‌లి వ‌స్తారు.

1802
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles