త‌మ్ముడి పార్టీ కండువా క‌ప్పుకున్న నాగ‌బాబు

Wed,March 20, 2019 01:04 PM

Actor NagaBabu garu Joining JanaSena Party

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న త‌మ్ముడు స్థాపించిన జ‌న‌సేన పార్టీ కండువా క‌ప్పుకొని అందరికి షాక్ ఇచ్చారు. కొన్నాళ్ళుగా జ‌న‌సేన పార్టీకి సంబంధించిన కార్య‌క్ర‌మాలు, ఇత‌ర‌త్రా విష‌యాల‌లో యాక్టివ్‌గా ఉంటున్న నాగ‌బాబు ఈ రోజు ప‌వ‌న్ స‌మ‌క్షంలో ఆయన పార్టీ కండువా క‌ప్పుకున్నారు. ప‌వ‌న్ స్వ‌యంగా సోద‌రుడిని పార్టీలోకి ఆహ్వానించి స్వాగ‌తం ప‌లికారు. పశ్చిమ గోదావరి జిల్లా న‌ర‌సాపురం లోక్ స‌భ స్థానం నుండి నాగ‌బాబు పోటీ చేస్తార‌ని ప‌వ‌న్ వెల్ల‌డించారు.పార్టీలో చేరిన వెంటనే ఆయనకు పవన్‌ బీ-ఫారాన్ని అందజేశారు. త‌న అన్న‌ని దొంగ దారిన కాకుండా రాజ‌మార్గంలో ప్ర‌జాక్షేత్రంలోకి తీసుకు వ‌స్తున్న‌ట్టు ప‌వ‌న్ పేర్కొన్నారు. ప్ర‌జా తీర్పుని మేము తప్ప‌క గౌర‌విస్తాం అని ఇదే సంద‌ర్భంలో ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గ‌తేడాది డిసెంబర్‌లో నాగబాబు రూ.25 లక్షలు జనసేనకు విరాళంగా ప్రకటించగా, ఆయన తనయుడు వరుణ్ తేజ్‌ కోటి రూపాయలను విరాళమిచ్చిన విష‌యం విదిత‌మే.

1952
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles