కమెడియన్‌ దిన్‌యర్‌ కన్నుమూత.. ప్రధాని సంతాపం

Wed,June 5, 2019 03:51 PM

Actor-Comedian Dinyar Contractor Dies

న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు, కమెడియన్‌ దిన్‌యర్‌ కాంట్రాక్టర్‌(79) ముంబయిలో ఈ ఉదయం కన్నుమూశారు. వృద్ధ్యాప్య కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వర్లీ శ్మాశనవాటికలో నేడు అంత్యక్రియలు జరపనున్నట్లు తెలిపారు. దిన్‌యర్‌ హాస్య నటనకు పెట్టింది పేరు. 2001లో వచ్చిన మల్టీ స్టారర్‌ మూవీ చోరీ చోరీ చుప్‌కే చుప్‌కేలో హోటల్‌ మేనేజర్‌గా, అక్షయ్‌ కుమార్‌ మూవీ కిలాడీలో ప్రిన్సిపల్‌ పాత్రలో, షారుక్‌ ఖాన్‌ నటించిన బాద్‌షాలో క్యాసినో మేనేజర్‌గా వేసిన పాత్రలు దిన్‌యర్‌కు బాగా ప్రాచుర్యం కల్పించాయి. గుజరాత్‌, హిందీ నాటక రంగంతో అనుబంధం కలవాడు. ఈ ఏడాది జనవరిలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. దిన్‌యర్‌ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. నాటకరంగమైన, టీవీయైన, సినిమాలైన తన నటనతో ఎంతో మంది ముఖాల్లో చిరునవ్వులు పూయించిన వ్యక్తిగా కొనియాడారు.889
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles