దాడి ఘటనపై సుప్రీంకోర్టుకు వెళ్తా : స్వామి అగ్నివేశ్

Sat,August 4, 2018 09:07 AM

Activist Swami Agnivesh to approach Supreme Court over Jharkhand mob attack

న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్.. సుప్రీంకోర్టును ఆశ్రయించాలనుకుంటున్నారు. తనపై దాడి జరిగి రెండు వారాలు గడుస్తున్నా.. ఆ ఘటనపై ఎటువంటి అరెస్టులు జరగలేదని ఆయన అన్నారు. దాడి ఘటనపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని సుప్రీంను డిమాండ్ చేయనున్నట్లు తయన తెలిపారు. కావాలనే తనపై జరిగిన దాడిని కప్పిపుచ్చుతున్నారని ఆయన ఆరోపించారు.సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్(80)పై బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని పాకూర్‌లో జూలై 17వ తేదీన‌ చోటు చేసుకుంది. లిట్టిపాడలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాకూర్‌కు స్వామి అగ్నివేష్ చేరుకున్నారు. అక్కడున్న ఓ హోటల్‌లో స్వామి అగ్నివేష్ ఉన్నాడన్న విషయం తెలుసుకున్న బీజేపీ యువ మోర్చా, విశ్వహిందు పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. హోటల్ నుంచి అగ్నివేష్ బయటకు రాగానే ఆయనపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఆయన బట్టలను చింపేశారు. నల్ల జెండాలను ప్రదర్శించిన ఆందోళనకారులు.. స్వామి అగ్నివేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వామి అగ్నివేష్.. క్రిస్టియన్ మిషనరీ సంస్థలతో చేతులు కలిపి.. జార్ఖండ్‌లోని గిరిజనులను క్రిస్టియన్లుగా మారుస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. దాడి జరిగిన అనంతరం స్వామి అగ్నివేష్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తాను హింసకు వ్యతిరేకమని చెప్పారు. శాంతియుతంగా ఉండే వ్యక్తిని తాను అని పేర్కొన్నారు. తనపై దాడి ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని స్వామి అగ్నివేష్ తెలిపారు.

2696
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles