విద్యార్థి హత్య కేసు.. స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెండ్

Sat,September 9, 2017 12:56 PM

Acting Principal of Ryan International School Suspended

న్యూఢిల్లీ : గుర్గావ్‌లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ తాత్కాలిక ప్రిన్సిపాల్ నీర్జా భట్రా సస్పెండ్ అయ్యారు. రెండో తరగతి చదువుతున్న ప్రద్యుమన్(7)ను బస్సు కండక్టర్ హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. విద్యార్థి హత్యపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. విద్యార్థి హత్యకు గల కారణాలపై నివేదిక ఇవ్వాలని కమిటీని కలెక్టర్ ఆదేశించారు. ఈ కేసులో విద్యార్థి తల్లిదండ్రుల డిమాండ్ మేరకు స్కూల్ ప్రిన్సిపాల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

శనివారం ఉదయం పాఠశాల వద్దకు భారీ సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకుని ఆందోళనకు దిగారు. తమ విద్యార్థులకు పాఠశాలలో భద్రత కరువైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కండక్టర్‌తో పాటు పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్సు కండక్టర్.. విద్యార్థిని బెదిరించి లైంగిక దాడికి యత్నించి విఫలమవడంతో ప్రద్యుమన్‌ను కత్తితో పొడిచి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో బస్సు కండక్టర్‌ను నిన్న సాయంత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

2690
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles