వివాహేతర సంబంధం.. కళ్లలో యాసిడ్ పోశారు

Sun,February 18, 2018 10:58 AM

Acid Injected In Man Eyes For Eloping With Employer Wife

పాట్నా : యజమాని భార్యతో వివాహేతర సంబంధం.. ఆపై ఇద్దరు పరారీ.. కోపం పెంచుకున్న యజమాని తమ్ముడు.. వదిన ప్రియుడి కళ్లలో యాసిడ్.. ఇదంతా సినీ ఫక్కీలో బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో జరిగింది. టెగ్‌హ్రా పోలీసు స్టేషన్ పరిధిలోని బరౌనీ గ్రామంలో ఓ రైతు వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా ఓ వ్యక్తి పని చేస్తున్నాడు. రైతు భార్యతో ట్రాక్టర్ డ్రైవర్‌కు వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో వీరిద్దరూ ఫిబ్రవరి 6న ఇంటి నుంచి పారిపోయారు. భార్య అదృశ్యమైందని రైతు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మొత్తానికి ఫిబ్రవరి 16న రైతు భార్య.. నేరుగా స్థానిక కోర్టుకు వెళ్లి తన భర్త వద్దే ఉంటానని పిటిషన్ దాఖలు చేసుకుంది. అయితే రైతు తమ్ముడు.. వదిన ప్రియుడికి ఫోన్ చేసి నాటకమాడాడు. మా వదిన నీతోనే ఉంటానని చెబుతోంది. వచ్చి తీసుకెళ్లు అని ట్రాక్టర్ డ్రైవర్‌ను పురమాయించాడు. దీంతో డ్రైవర్ రైతు ఇంటికి వస్తున్న క్రమంలో మార్గమధ్యలో మాటు వేసిన 20 మంది వ్యక్తులు.. అతడిపై దాడి చేశారు. కళ్లలో ఇంజెక్షన్‌తో యాసిడ్ దాడి చేశారు. రోడ్డు పక్కన స్పృహ తప్పిపడిపోయిన బాధితుడిని కొందరు వ్యక్తులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు కారణమైన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

2377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles