మేం రేప్ చేయలేదు.. మాకు నార్కో పరీక్ష చేయండి..

Mon,April 16, 2018 03:29 PM

accused in Kathua rape case demands Narco test

కతువా: జమ్మూకశ్మీర్‌లోని కతువా రేప్ కేసులో నిందితులుగా ఉన్న 8 మంది ఇవాళ జిల్లా కోర్టు ముందు హాజరయ్యారు. ఆ అత్యాచారంతో తమకు సంబంధం లేదని, తమకు నార్కో పరీక్ష నిర్వహించాలని నిందితులు జడ్జిను కోరారు. అయితే ఈ కేసులో తీర్పును ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జిల్లా సెషన్స్ జడ్జి సంజయ్ గుప్తా తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. అయితే ఈకేసులో చార్జ్‌షీట్ కాపీలను తన ముందు పెట్టాలని జడ్జి ఆ రాష్ట్ర క్రైం బ్రాంచ్ పోలీసులను కోరారు. మరోవైపు నిందితులందరూ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ దగ్గర బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాని విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేశారు. స్థానిక తెగలకు చెందిన కొందరు ఓ 8 ఏళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి రేప్ చేసినట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు తమ చార్జ్‌షీట్‌లో రాశారు. జైలులో ఇవాళ వాదనలు ముగిసిన తర్వాత మళ్లీ నిందితులను పూర్తి భద్రత మధ్య కారాగారానికి తరలించారు. త‌న‌కు నార్కో ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని ప్ర‌ధాన నిందితుడు సాంజీ రామ్ డిమాండ్ చేశారు. చిన్నారి అత్యాచారం, హ‌త్య వెనుక కుట్ర ఉన్న‌ద‌ని, త‌న తండ్రికి ఆ ఘ‌ట‌న‌తో సంబంధం లేద‌ని, ఈ కేసును సీబీఐ విచారించాల‌ని సాంజీ రామ్ కూతురు డిమాండ్ చేసింది.

7342
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS