న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ అభినందన్ ను శుక్రవారం విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నిర్ణయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా స్వాగతించారు. వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేస్తామనే వార్త..అతని కుటుంబసభ్యులకు, దేశ పౌరులకు శుభవార్త అని వాద్రా అన్నారు. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పడం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని రాబర్ట్ వాద్రా అభిప్రాయపడ్డారు. శాంతిని ప్రోత్సహించడంలో భాగంగా వింగ్ కమాండర్ అభినందన్ ను విడుదల చేయాలని నిర్ణయించామని పాకిస్థాన్ పార్లమెంట్లో ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు.