పోలీసుల మాదిరే ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్న శునకం.. వీడియో

Tue,November 19, 2019 11:10 AM

చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైలోని పార్క్‌ టౌన్‌ రైల్వేస్టేషన్‌లో ఓ శునకం పోలీసుల కంటే మెరుగ్గా విధులు నిర్వర్తిస్తూ ప్రయాణికులను ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేస్తుంది. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది మాదిరిగానే రాత్రింబవళ్లు ఆ శునకం.. ప్రయాణికులను కంటికి రెప్పలా చూసుకుంటుంది. స్టేషన్‌లో ఏ ప్రయాణికుడి అయినా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిని అప్రమత్తం చేస్తుంది. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని ఉపయోగించకుండా.. రైలు పట్టాలను దాటే వారిని నిలువరించేందుకు ప్రయత్నిస్తుంది ఆ కుక్క. ఒక వేళ్ల ప్రయాణికులు అప్రమత్తం కాకపోతే వారికి ఎదురుగా నిలబడి గర్జిస్తుంది. ఫుట్‌ బోర్డింగ్‌ చేస్తున్న వారి వెంట పరుగెత్తి.. అప్రమత్తం చేస్తుంది. మొత్తానికి కుక్క నిర్వర్తిస్తున్న విధులపై అటు ఆర్పీఎఫ్‌ పోలీసులు, ఇటు ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ కుక్క ఇప్పటి వరకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. కుక్క నిర్వర్తిస్తున్న విధులను వీడియోగా చిత్రీకరించి.. మినిస్ట్రీ ఆఫ్‌ రైల్వేస్‌ ట్విట్టర్‌ పేజీలో పోస్టు చేశారు.1451
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles