మేం 13 స్థానాల్లో పోటీ చేస్తాం..

Sun,January 20, 2019 06:44 PM

AAP to contest all 13 Lok Sabha seats in Punjab says Kejriwal

చంఢీగఢ్ : రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లోని 13 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పంజాబ్ లోని సంగ్ రూర్ లో నిర్వహించిన ర్యాలీలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ..దేశ ప్రజలు మోదీ ప్రభుత్వ పాలనతో విసిగిపోయి ఉన్నారని ఎద్దేవా చేశారు. మోదీ, అమిత్ షా ప్రజల హృదయాలను విషపూరితం చేసి, దేశాన్ని నాశనం చేశారని నిప్పులు చెరిగారు. మరోసారి వాళ్లు అధికారంలోకి వస్తే దేశాన్ని విభజిస్తారని, దీంతో రాజ్యాంగం మనుగడ కష్టసాధ్యమవుతుందని మండిపడ్డారు. పంజాబ్ లో అన్ని స్థానాల్లో ఆప్ అభ్యర్థులు పోటీ చేస్తారని, పంజాబ్ ను ఢిల్లీ మోడల్ గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని కేజ్రీవాల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఢిల్లీలో చేస్తున్న మంచి పనులను పంజాబ్ లో కూడా చేస్తామన్నారు.

5273
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles