ఆల్కా లంబాపై అనర్హత వేటు

Thu,September 19, 2019 07:47 PM

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రెబెల్ ఎమ్మెల్యే ఆల్కా లంబా.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆల్కా లంబాపై ఢిల్లీ స్పీకర్ అనర్హత వేటు వేశారు.


ఢిల్లీలోని చాందినీ చౌక్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే అల్కా లంబా.. సెప్టెంబర్ 6వ తేదీన ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి రాజీనామా చేశారు. ఈ మేరకు నాడు ఆమె ట్వీట్‌ చేశారు. ఆప్‌కు గుడ్‌బై చెప్పాల్సిన సమయం వచ్చింది. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా ఆమె పార్టీ నాయకత్వాన్ని కోరారు. ఇప్పుడు ఆమ్‌ ఆద్మీ పార్టీ కాదు.. ఖాస్‌ ఆద్మీ పార్టీ అని అల్కా లంబా ట్వీట్‌లో పేర్కొన్నారు. తన రాజీనామాను ట్వీట్టర్‌లో పెట్టినప్పటికీ ఆమోదిస్తామని ఆప్‌ అధికార ప్రతినిధి చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తన రాజీనామాను ఆమోదించాలన్నారు. ఆ పార్టీ పేదల పార్టీ కాదు.. బంధు ప్రీతి పార్టీ అని పేర్కొన్నారు అల్కా లంబా

1006
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles