ఢిల్లీలో రూ. 10కే ఆప్ భోజనం

Mon,March 28, 2016 06:37 PM

AAP Delhi Budget Stars Aam Aadmi Canteens, CCTV In Classrooms

న్యూఢిల్లీ : ఢిల్లీలోని కార్మికులకు, సామాన్య ప్రజలకు తక్కువ ధరకే భోజనం అందించేందుకు ఆప్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఢిల్లీ శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆప్ క్యాంటీన్లకు రూ. 10 కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం మనీశ్ సిపోడియా వెల్లడించారు. రుచికరమైన భోజనాన్ని రూ. 5 నుంచి రూ. 10కే అందిచనున్నారు. ఆప్ క్యాంటీన్లు తమిళనాడు సీఎం జయలలిత ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్ల మాదిరిగానే ఉండనున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు రూ.100 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి తరగతి గదిలో సీసీటీవీలు అమర్చాలని నిర్ణయించారు. ప్రైవేట్‌ స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సిసోడియా తెలిపారు.

1494
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS