రైల్లో గర్బ ఆడుతూ ఎంజాయ్ చేసిన మహిళలు.. వీడియో

Wed,October 17, 2018 03:11 PM

A video of Women playing Garba in a moving train gone viral in Social Media

ముంబై: నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గర్బ, దాండియాలతో వీధులు మార్మోగుతున్నాయి. అయితే కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ షేర్ చేసిన ఈ వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్నది. కొంతమంది మహిళలు కదిలే రైల్లోనే గర్బ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇది. ఓ లోకల్ ట్రెయిన్‌లో మహిళలు ఆడుతున్న సమయంలో తీసిన వీడియో ఇది. ఇంటర్నెట్‌లో ఎంతోమంది మనసు దోచుకుంటున్నది. ఇలాంటి వీడియోలు ఎవరి దగ్గర ఉన్నా షేర్ చేయాల్సిందిగా నెటిజన్లు కోరుతున్నారు. ఇలాంటి అనుభవం కేవలం మీకు ఇండియన్ రైల్వేస్‌తోనే సాధ్యం అంటూ మంత్రి ఈ వీడియో పోస్ట్ చేయడం విశేషం.


ఇక ఇలాంటిదే మరో వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా చెక్కర్లు కొడుతున్నది. న్యూయార్క్ వీధుల్లో మహిళలు గర్బ ఆడుతుండగా... ఓ పోలీసు కూడా వాళ్లతో కలిసి స్టెప్పులేస్తున్న వీడియో అది.
ఇక రైల్లోనే కాదు.. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోనూ ఇలాగే ప్రయాణికులు కొందరు స్వాగతం పలుకుతున్నారు.

5349
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles