ఏటీఎం గదిలో పాము కలకలం

Wed,April 24, 2019 12:11 PM

చెన్నై: ఏటీఎం గదిలోకి ప్రవేశించిన ఓ పాము కలకలం సృష్టించింది. ఈ ఘటన తమిళనాడులోని కొయంబత్తూర్‌లోగల థనేర్‌పండల్‌ రోడ్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఏటీఎంలో పాము సంచారాన్ని గమనించిన పలువురు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇవ్వడంతో సదరు వ్యక్తి వచ్చి ఆ పామును పట్టుకుని సురక్షితంగా తరలించాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

1700
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles