మర్మాంగాలు కోసుకున్న సాధువు!

Fri,October 19, 2018 05:23 PM

A Sadhu in UP cuts off his genitals over allegations of his affair with a woman

బామ్నా (ఉత్తర్‌ప్రదేశ్): ఓ మహిళతో తనకు సంబంధం అంటగట్టారని ఫీలయిన ఓ సాధువు.. తన మర్మాంగాలను కోసుకున్నాడు. ఈ ఘటన యూపీలోని బామ్నా జిల్లాలో జరిగింది. మదానీ బాబా అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఓ స్థలంలో తాను ఆశ్రమం కట్టడం ఇష్టం లేని కొందరు వ్యక్తులు తనపై ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సదరు బాబా విమర్శించాడు. స్థానికంగా ఉండే ఓ మహిళతో తనకు అనవసరంగా సంబంధం అంటగట్టారని ఆ సాధువు ఆరోపించాడు. 28 ఏళ్ల మదానీ బాబా అనే ఆ వ్యక్తి కంసిన్ గ్రామంలో ఉంటున్నాడు. తనపై వచ్చిన ఆరోపణలకు నిరసనగా అతడు తన మర్మాంగాలను కోసుకున్నాడు. అతనికి ప్రస్తుతం చికిత్స జరుగుతున్నది అని బామ్నా జిల్లా ఆసుపత్రి డాక్టర్ బల్వీర్ సింగ్ వెల్లడించారు. దీనిపై జిల్లా పోలీసులు విచారణ చేపడుతున్నారు.

9672
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles