మాజీ ఐపీఎస్‌ ఆఫీసర్‌పై దాడి

Wed,August 14, 2019 11:24 AM

A Retired IPS Officer thrashed by bike borne miscreant in Patna

పాట్నా : బీహార్‌ రాజధాని పాట్నాలో మాజీ ఐపీఎస్‌ ఆఫీసర్‌, ఆయన కుమారుడిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ అజయ్‌ వర్మ, ఆయన భార్య, కుమారుడు పార్క్‌ చేసిన కారులో కూర్చున్నారు. ఈ సమయంలో వీరి కారును ఓ యువకుడు బైక్‌పై వచ్చి ఢీకొట్టాడు. దీంతో మాజీ ఐపీఎస్‌ ఆఫీసర్‌ కుమారుడు కారు దిగి.. యువకుడిని ప్రశ్నించాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత సదరు యువకుడు సుమారు 50 మంది స్నేహితులను పిలిపించుకుని.. అజయ్‌ వర్మ, ఆయన కుమారుడిపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సమయంలో అజయ్‌ వర్మ భార్య పోలీసులకు సమాచారం అందించినప్పటికీ వారు స్పందించలేదు. యువకులు కూడా అక్కడ్నుంచి పారిపోయారు. దాడి నుంచి కోలుకున్న అజయ్‌ వర్మ.. సమీప పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా, ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదని చెప్పారు. దీంతో వారు మళ్లీ సంబంధిత పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మొత్తానికి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే యువకులు దాడి చేసిన దృశ్యాలను అజయ్‌ భార్య తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసింది. యువకుడి బైక్‌ నంబర్‌ను కూడా నమోదు చేసుకుంది ఆమె. బైక్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

740
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles