ఒకే ఒక్కడు ఓటేశాడు

Tue,April 23, 2019 05:35 PM

A polling booth in Gir Forest has been set up for 1 voter in Junagadh

గాంధీనగర్: ప్రతీ ఓటు విలువైనదే. గుజరాత్ రాష్ట్రంలోని జూనాగడ్ ప్రాంతంలో నేడు జరిగిన పోలింగ్ ఇందుకు ఓ ఉదాహరణ. గిర్ అటవీ ప్రాంతంలో ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేది ఎందరో తెలుసా?. ఒక్కడు మాత్రమే. అవును.. ఇక్కడ ఓటేసేది ఒకే ఒక్కడు. ఇతని కోసం అధికారులు ఆ అటవీ ప్రాంతంలో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. భరత్‌దాస్ అనే వ్యక్తి నేడు జరిగిన సార్వత్రిక ఎన్నికల మూడవ దశ పోలింగ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం అతడు మాట్లాడుతూ.. నేను ఓటేశాను. ఇక్కడ 100 శాతం పోలింగ్ జరిగింది. అదేవిధంగా ప్రతీచోట 100 శాతం పోలింగ్ నమోదవ్వాలి. అందరూ వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నట్లు పేర్కొన్నాడు.


3219
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles