విరామంలేని మనిషి విశ్రాంతి తీసుకున్నాడు..

Wed,August 8, 2018 03:07 PM

A person who continued to work without rest, now takes rest written on the coffin of Karunanidhi mortal remains

చెన్నై: విరామం లేకుండా నిరంతరం పనిచేసిన వ్యక్తి ఇప్పుడు శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నాడు. కరుణానిధి శవపేటికపై ఈ నినాదాన్ని రాశారు. మెరీనా బీచ్‌లో ఇవాళ సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి ఖననం జరగనున్నది. అయితే ఆయన పార్ధీవదేహాన్ని తరలించేందుకు తయారు చేసిన శవపేటికపై ఓ నినాదాన్ని రాశారు. విరామం లేకుండా పనిచేసిన కరుణ ఇప్పుడు శాశ్వత విశ్రాంతి తీసుకున్నారని శవపేటికపై రాశారు.

మ‌రోవైపు రాజాజీ హాల్ వ‌ద్ద భారీగా వ‌చ్చిన అభిమానుల్ని కంట్రోల్ చేయ‌డం పోలీసుల వ‌ల్ల కాలేదు. దీంతో అక్క‌డ లాఠీచార్జ్ జ‌రిగింది. ఆ ఘ‌ర్ష‌ణ‌లో ఇద్ద‌రు మృతిచెందారు. రాజాజీ హాల్ వ‌ద్ద భారీ సంఖ్య‌లో జ‌నం పోటెత్తారు. తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డ్డ 10 మందిని రాజీవ్ గాంధీ హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు. సుమారు 41 మంది గాయ‌ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. రాజాజీ హాల్ వ‌ద్ద గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొన‌డంతో.. శాంతియుతంగా ఉండాల‌ని స్టాలిన్ ప్ర‌జ‌ల్ని కోరారు. మెరీనా బీచ్ వ‌ద్ద ఖ‌న‌నం కోసం కోర్టులో కేసు గెలిచామ‌ని స్టాలిన్ అన్నారు. రిజ‌ర్వేష‌న్ల కోసం క‌రుణా పోరాడార‌ని, ఆయ‌న పార్ధీవ‌దేహాం ఖ‌న‌నం కోసం కోర్టుకు వెళ్లాల్సి వ‌చ్చింద‌న్నారు.

1190
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles