అత‌ని ద‌గ్గ‌ర అమ్మ‌, చిన్నమ్మ ఆసుప‌త్రి వీడియో!Fri,April 21, 2017 03:47 PM

A nephew of Sasikala have the clips of Jayalalithaa in Hospital

చెన్నై: జ‌య‌ల‌లిత మ‌ర‌ణంపై మిస్ట‌రీ ఇంకా వీడ‌నే లేదు.. దీనికి మ‌రో ట్విస్ట్ ఇచ్చాడు శ‌శిక‌ళ మేన‌ల్లుడు జయానంద్ దివాక‌ర‌న్‌. ఆసుప‌త్రిలో అమ్మ జ‌య‌ల‌లిత‌, చిన్న‌మ్మ శ‌శిక‌ళ క‌లిసి ఉన్న వీడియో క్లిప్పులు త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశాడు జ‌యానంద్‌. ఈ వీడియో చూస్తే ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న సంబంధం ఏంటో స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని అత‌ను ఆ పోస్ట్‌లో చెప్పాడు. అయితే వివాదం కావ‌డంతో వెంట‌నే ఆ పోస్ట్‌ను అత‌ను డిలిట్ చేసేశాడు.

శ‌శిక‌ళ‌పై హంత‌కురాలిగా ముద్ర వేసినా ఆమె మాత్రం జ‌య‌ల‌లిత ఫొటోను విడుద‌ల చేయలేదు. ఎందుకంటే జ‌య‌ శ‌త్రువులు ఆమెను ఆ ప‌రిస్థితిలో చూడ‌టం శ‌శిక‌ళ‌కు ఇష్టం లేదు అన్న‌ది ఆ పోస్ట్ సారాంశం. చివ‌రి నిమిషం వ‌ర‌కు ఆమెను ఓ సింహంలాగే ఉంచామ‌ని, అదే రీతిలో తుదిసారి వీడ్కోలు ప‌లికామ‌ని అత‌ను అన్నాడు. ప‌న్నీర్ మాత్రం ఓట్ల కోసం జ‌య మ‌ర‌ణంపై నాట‌కాలు ఆడుతున్నార‌ని జ‌యానంద్ ఆరోపించాడు. ఏదో ఒక‌రోజు ఆ వీడియో బ‌య‌టకు వ‌స్తే నిజం బ‌య‌ట ప‌డుతుంద‌ని అత‌ను అన్నాడు.

1933
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS