మోదీ ఎదుటే.. మంత్రితో మరో మంత్రి అసభ్య ప్రవర్తన.. వీడియో

Tue,February 12, 2019 10:21 AM

A minister in Tripura touches a woman minister inappropriately in the presence on Modi

అగర్తల: వేదికపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎదురుగానే ఉన్నారు. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ కూడా అక్కడే ఉన్నారు. కింద వేల మంది ప్రజలు. అయినా సాటి మహిళా మంత్రితో మరో మంత్రి అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. త్రిపురలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మనోజ్ కాంతి దేవ్ ప్రవర్తించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మహిళా మంత్రి సాంతనా చక్మా నడుముపై ఆయన చేయి వేయడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ చర్యతో ఇబ్బందిగా ఫీలైన చక్మా.. వెంటనే ఆయన చేయిని నెట్టేశారు. ఇలాంటి మంత్రిని వెంటనే తొలగించాలని, లైంగిక వేధింపుల కేసు నమోదు చేయాలని ప్రతిపక్ష లెఫ్ట్ ఫ్రంట్ డిమాండ్ చేస్తున్నది. ఆదివాసీ యువ నేత అయిన సాంతనా చక్మాతో ఇంత పబ్లిగ్గా కాంతి దేవ్ అసభ్యంగా ప్రవర్తించారని, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని లెఫ్ట్ ఫ్రంట్ కన్వీనర్ బిజన్ ధార్ డిమాండ్ చేశారు. ప్రధాని, ముఖ్యమంత్రి వేదికపై ఉండగానే కేబినెట్‌లోని ఏకైక మహిళా మంత్రితో ఇంత దారుణంగా వ్యవహరించారని ధార్ విమర్శించారు. అయితే అధికార బీజేపీ మాత్రం వీటిని కొట్టి పారేసింది. దీనిపై ఆ మహిళా మంత్రి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, లెఫ్ట్ పార్టీలకు మాత్రం ఎందుకింత చెత్త రాజకీయాలు చేస్తున్నాయంటూ బీజేపీ ప్రతినిధి నబేందు భట్టాచార్జీ అన్నారు. అటు ఈ ఘటనపై స్పందించడానికి మంత్రి కాంతి దేవ్ నిరాకరించారు.


4890
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles