ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చెంప చెల్లుమనిపించాడు:వీడియో

Sat,May 4, 2019 06:26 PM

A man slaps Delhi Chief Minister Arvind Kejriwal during his roadshow in Moti Nagar area.

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోతీనగర్‌లో రోడ్‌షోలో కేజ్రీవాల్‌ పాల్గొన్నారు. రోడ్‌షోలో భాగంగా వాహనంపై ఉన్న కేజ్రీవాల్‌ ప్రజలకు అభివాదం చేస్తున్నారు. అకస్మాత్తుగా ఓ వ్యక్తి జీపుపైకి ఎక్కి అరవింద్‌ చెంపపై బలంగా చేతితో కొట్టారు. అనంతరం అతడిని ఆప్‌ కార్యకర్తలు పట్టుకొని చిత‌క‌బాదారు. దాడికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

రెండు నెల‌ల క్రితం కూడా కేజ్రీవాల్ కారుపై కొందరు దాడి చేశారు. తమ ప్రాంతంలో మెట్రో విస్తరణ చేపట్టడం లేదని నిరసిస్తూ దాదాపు 100 మంది కేజ్రీవాల్ కారును అడ్డగించడానికి ప్రయత్నించి అనంతరం తమ వద్ద ఉన్న కర్రలతో కారుపై దాడి చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.2583
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles