వివాహితను తీసుకెళ్లాడని చెట్టుకు కట్టేసి కొట్టారు..

Thu,May 16, 2019 12:17 PM

a man and 2 women tied to tree in Madhya Pradesh

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని అర్జున్ కాలనీలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి వివాహితతో పాటు చిన్నారిని తీసుకెళ్లాడనే నెపంతో అతడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. వ్యక్తి ఒక్కడినే కాదు.. మహిళతో పాటు మైనర్‌ను కూడా చెట్టుకు కట్టేశారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఇటీవలే ఓ మహిళ అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. అయితే ఆ మహిళ ఇంటి నుంచి పారిపోయేందుకు సదరు వ్యక్తి సహకరించినట్లు తెలిసింది. కానీ ఆమెను బలవంతంగా అతను తీసుకెళ్లలేదు. దీనిపై విచారణ జరుపుతున్నాం. వ్యక్తిని కొట్టిన కేసులో ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

3355
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles