భర్తను చంపి.. 13 ఏళ్లు సెప్టిక్ ట్యాంక్‌లో దాచింది!

Thu,December 7, 2017 03:39 PM

A Lady in Mumbai murdered husband buried in septic tank

ముంబై: సెక్స్ రాకెట్ నడిపిస్తున్నదని ఓ మహిళ ఇంటిపై దాడి చేస్తే అంతకుమించిన విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బోయిసర్‌కు చెందిన ఫరీదా భారతి అనే మహిళ 13 ఏళ్ల కిందటే తన భర్తను చంపి ఇంటి వెనుకాల సెప్టిక్ ట్యాంక్‌లో ఖననం చేసింది. ఆ ఇంట్లో వ్యభిచారం నడుస్తుందన్న సమాచారంతో పోలీసులు దాడి చేయగా.. ఆమె భర్త తాలూకు అస్తిపంజరం బయటపడింది. సోమవారం తొలిసారి దాడి చేసి నలుగురు యువతులకు విముక్తి కల్పించారు పోలీసులు. అయితే ఆమె వ్యభిచారంతోపాటు పలువురిని హత్య కూడా చేసిందన్న సమాచారంతో మరోసారి ఆమె ఇంటికి వెళ్లారు. ఈసారి ఇంటి మొత్తాన్నీ పరిశీలించగా.. ఫరీదా భర్త అస్తిపంజరం కనిపించింది. ఆమెను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. విచారణలో ఆమె తన భర్తను చంపినట్లు అంగీకరించింది. 13 ఏళ్ల కిందటే అతన్ని చంపి, సెప్టిక్ ట్యాంక్‌లో పూడ్చినట్లు ఫరీదా చెప్పడం గమనార్హం. అతను నిద్రలో ఉన్నపుడు తలపై కొట్టి చంపినట్లు ఫరీదా చెప్పింది. అయితే అతన్ని ఎందుకు చంపిందన్నది ఇంకా తెలియలేదని బోయిసర్ సీఐ కిరణ్ కబాడీ తెలిపారు.

14358
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS