న్యూఢిల్లీలో ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సమావేశం

Sun,April 24, 2016 10:44 AM

A Joint Conference of Chief Justices of High Courts and Chief Ministers of States in new delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. ఇవాళ విజ్ఞానభవన్‌లో జరుగుతోన్న ఈ సమావేశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. కార్యక్రమానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్‌తోపాటు పలువురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. న్యాయవ్యవస్థలోని పాలనపరమైన సమస్యలను చర్చించేందుకు ప్రతీ సంవత్సరం ఇలా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. గత సంవత్సరం ఏప్రిల్ 5, 2015న సమావేశంను నిర్వహించిన విషయం తెలిసిందే.

1418
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS